రేపు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ

దేశంలో లాక్ డౌన్ రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం 10 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. కరోనా రోజురోజుకు పెరుగుతుండడంతో లాక్ డౌన్ పై ఇప్పటికే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ చర్చించారు. ఇక, దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు తెలంగాణలోనూ లాక్ డౌన్ ను ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగించిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పటివరకు దేశంలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 9373కు చేరగా, మృతుల సంఖ్య 331కి చేరింది.