కొవిడ్‌ వలంటీర్లుగా దరఖాస్తు చేసుకోండి

కొవిడ్‌-19 నివారణ చర్యల్లో వలంటీర్లుగా పనిచేయడానికి రిటైర్డ్‌ ఆర్మీ, పారామిలిటరీ, పోలీస్‌, ఎక్సైజ్‌ అధికారులను ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ నెల 22లోగా transport.telangana.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని మంగళవారం ఒక ప్రకటనలో ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ కోరారు. కరోనా నియంత్రణకు రోగి సంరక్షణ సేవలు, లాజిస్టిక్స్‌, భద్రత నిర్వహణకు వాలంటీర్లుగా పాలుపంచుకొనేందుకు ముం దుకురావాలని సీఎస్‌ విజ్ఞప్తిచేశారు.