లాక్‌డౌన్ దృష్ట్యా ఎక్కడివారు అక్కడే ఉండాలి: సిపి సజ్జనార్

వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని సిపి సజ్జనార్ తెలిపారు. చిన్నపిల్లలతో కాలినడకన ప్రమాదకరమైన ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. ఎక్కువ దూరం నడవటం వల్ల ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. వలస కార్మికులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. లాక్‌డౌన్ పై వదంతులు నమ్మి ఇబ్బందులు ఎదుర్కోవద్దన్న సిపి లాక్ డౌన్ దృష్ట్యా ఎక్కడివారు అక్కడే ఉండాలని హెచ్చరించారు. ఇబ్బందుల్లో ఉన్న వలస కార్మికులకు పోలీసులు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటారని హామీ ఇచ్చారు. ఆహార, ఆరోగ్య సమస్యలు ఉంటే సమాచారం ఇవ్వాలని చెప్పారు. నిరాశ్రయుల కోసం ప్రభుత్వం ప్రత్యేక షెల్టర్లు ఏర్పాటు చేసిందని వెల్లడించారు. స్వస్థలం వెళ్లినా అక్కడ కూడా ఇంట్లోనే ఉండాల్సి వస్తుందన్నారు. కూలీల బాగోగులు చూసుకోవాలని భవన నిర్మాణ సంస్థలకు ఆదేశాలు ఇచ్చామని సజ్జనార్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలను పాటించకుంటే కార్మిక, భవన నిర్మాణ సంస్థలపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు