మలక్ పేటలో ఒకే కుటుంబంలో 11 మందికి కరోనా – సీఎస్ సోమేష్ కుమార్

కరోనా నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాయని సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. కంటైన్‌మెంట్ జోన్లలో సీఎస్ సోమేష్ కుమార్ పర్యటించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కంటైన్‌మెంట్ జోన్లలో ఇంటికే నిత్యాసరాలు అందిస్తామని సిఎస్ పేర్కొన్నారు. వాట్సాప్ గ్రూప్ ద్వారా అవసరమైన నిత్యావసరాలు ఇస్తామని, మలక్‌పేట జోన్‌లో ఒకే కుటుంబానికి చెందిన 11 మందికి కరోనా వైరస్ సోకిందని, నెగటివ్ వచ్చిన కొంతమందిని క్వారంటైన్‌లో ఉంచుతున్నామని, వైద్య అధికారులతో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని, 14 రోజుల్లో పాజిటివ్ నమోదు కాకపోతే కంటైన్‌మెంట్ తొలగిస్తామన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు 706 మంది కరోనా వైరస్ సోకగా 19 మంది మృతి చెందారు. కరోనా నుంచి 187 మంది కోలుకున్నారు. భారత దేశంలో కరోనా రోగులు సంఖ్య 13,694కు చేరుకోగా 456 మంది చనిపోయారు.