జేఎంఎం నేత హేమంత్‌ సోరెన్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు

ఫైల్ ఫోటో

జార్ఖండ్‌ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన జేఎంఎం నేత హేమంత్‌ సోరెన్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు. జేఎంఎం పార్టీ జార్ఖండ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తెలంగాణకు మంచిదని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమానికి హేమంత్‌ తండ్రి శిబుసోరెన్‌, హేమంత్‌ సోరెన్‌ మద్దతు తెలిపారని చెప్పారు.జార్ఖండ్‌ సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్న జేఎంఎం నేత హేమంత్‌కు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలియజేశారు.