భారత్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 47 మరణాలు, 1,336 కొత్త కేసులు నమోదయ్యాయని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 18,601కు పెరిగింది. ప్రస్తుతం 1,4759 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 3,252 కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 590 కోవిడ్-19తో మరణించారని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. మహారాష్ట్రలో అత్యధికంగా 4,666 కేసులు నమోదయ్యాయి. అందులో ముంబైలోనే 3వేలకు పైగా పాజిటివ్ కేసులున్నాయి. ముంబైలో 53మందికి జర్నలిస్టులకు కరోనా సోకినట్టు అధికారులు వెల్లడించారు.