తెలంగాణలో కొత్తగా 56 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

తెలంగాణలో మంగళవారం ఒక్కరోజే కొత్తగా 56 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో  ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి  సంఖ్య 928కి పెరిగింది. ఇప్పటి వరకు కరోనా బారినపడి 23 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 711 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇవాళ కరోనా నుంచి  కోలుకొని 8 మంది డిశ్చార్జ్‌ కాగా ఇప్పటి వరకు మొత్తం 194 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. సూర్యాపేట జిల్లాలో ఒక్కరోజే 26 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. జీహెచ్‌ఎంసీలో 19, నిజామాబాద్‌లో 3, గద్వాలలో 2, ఆదిలాబాద్‌లో 2 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా కాగా..ఖమ్మం, మేడ్చల్‌, వరంగల్‌, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కో కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.