లాక్‌డౌన్ కాలంలో దివ్యాంగులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. వికలాంగులు, చెవుడు, మూగ, మానసిక సమస్యలు ఉన్న వారంతా 1800 572 8980 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి తమ సమస్యలను చెప్పుకొవచ్చు. ఈ హెల్ప్‌లైన్ నంబర్ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా మరో టోల్ ఫ్రీ నెంబర్ 14567 కేటాయించారు. ఇది కూడా ఉదయం 8 నుంచి రాత్రి 7 గంటల వరకు పని చేస్తుంది.