ఆంధ్రపదేశ్‌లో కరోనా కేసులు భారీగా పెరగుతున్నాయి. అక్కడ కరోనా వైరస్ అంతకంతకూ విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 62 కేసులు నమోదుకాగా.. ఇద్దరు మృతిచెందారు. దీంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 955కి చేరింది. ఇందులో 781 యాక్టివ్ కేసులుండగా..145 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు ఏపీ ఆరోగ్యమంత్రిత్వశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇవ్వాళ కొత్తగా నమోదైన కేసుల్లో కర్నూలు జిల్లాలో 27, కృష్ణా జిల్లా 14, గుంటూరు జిల్లా 11, ప్రకాశం 3, తూ.గో 2, అనంతపురం జిల్లా 4, నెల్లూరు జిల్లాలో ఒక్క కేసు నమోదయ్యాయి.