సిద్దిపేటకే కాదు రాజన్న సిరిసిల్ల జిల్లాను కూడా రంగనాయక సాగర్ ప్రాజెక్టు సస్యశ్యామలం చేస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్‌కు సిద్ధిపేట అంటే అమితమైన ప్రేమ. సిద్దిపేట ప్రజలు ధన్య జీవులు. చిరస్మరణీయ ఘట్టం మా చేతుల మీదుగా ప్రారంభం కావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ ప్రాజెక్టుతో ఆరు నియోజకవర్గాలకు శాశ్వతంగా సాగునీరు అందనుంది. కాళేశ్వరం నిర్మాణంలో సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా హరీశ్‌రావు శ్రమించారు. కాళేశ్వరం నిర్మాణంలో శ్రమించిన హరీశ్‌రావుకు అభినందనలు. మెతుకు సీమ తెలంగాణకు బువ్వ పెట్టే జిల్లా కావాలని కోరుకుంటున్నా. కాళేశ్వరం నిర్మాణంలో సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగూణంగా హరీశ్‌రావు శ్రమించారు.

హరీశ్‌రావు నాయకత్వంలో కార్మికులు కాలంతో పోటీపడి శ్రమించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో, మంత్రి హరీశ్‌రావు శ్రమతో తెలంగాణ రాష్ట్రం కోటి ఎకరాల మాగాణం కల త్వరలో సాకారమవుతుంది. రాబోయే రోజుల్లో తెలంగాణలో నాలుగు విప్లవాలు చూడబోతున్నాం. హరీతవిప్లవం, మత్స్యసంపద పెరిగి నీలి విప్లవం, పాడి రైతులు క్షీర విప్లవం తీసుకువస్తారు, గొర్రెల పెంపకం ద్వారా గులాబి విప్లవం వస్తుంది. దేశానికే ఆదర్శంగా నిలిచే అగ్రశ్రేణి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. ప్రాజెక్టు నిర్ణాణంగా శ్రమించిన కార్మికులకు, ఇంజినీర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
భూములిచ్చిన రైతులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా… హరీశ్‌రావు ఆనాడు తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు ఎంతో సంతోషంగా ఉందో…ఇప్పుడు కూడా అంతే సంతోషంగా ఉందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం అంటే దశాబ్ధాలు కాదని మరోసారి సీఎం కేసీఆర్ నిరూపించారు. ప్రాజెక్టు నిర్మాణంలో కూలీల కృషి మరువలేం. సిద్ధిపేటకు గోదావరి జలాలు రావడం దశబ్ధాల కల.. సీఎం కేసీఆర్ అవిశ్రాంతంగా శ్రమించి సిద్దిపేట వాసులు చిరకాల స్వప్నాన్ని నెరవేర్చారు. ప్రాజెక్టు నిర్మాణంలో శ్రమించిన అందరికీ కృతజ్ఞతలు. సమైక్యరాష్ట్రంలో సిద్దిపేట జిల్లాలో ఒక ఎకరానికి నీళ్లు రాలేదు. కాలమైతే తప్ప కడుపు నిండని పరిస్థితి ఉండే. లక్షలాది మంది మధ్య జరుపుకోవాల్సిన అపురూప ఘట్టాన్ని కరోనా వల్ల నిరాడంబరంగా జరుపుకుంటున్నాం.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం మాదిరిగానే ఈ జల సాధన ఉద్యమం విజయవంతం అయింది. కేసీఆర్ కల సాకారమైంది.ఒక్క ఇల్లు కూడా ముంపుకు గురికాకుండా 3 టీఎంసీల నీటి సామర్థ్యంతో రంగనాయక సాగర్ ప్రాజెక్టు నిర్మించుకోవడం ఒక అరుదైన ఘట్టం. ఇది సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వ పనితీరు కు గొప్ప నిదర్శనం. భూములిచ్చి త్యాగాలు చేసిన రైతులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మీ త్యాగాలు మరువలేనివి. త్యాగాలు చేసిన రైతుల పేర్లు సువర్ణాక్షరాలతో లికించబడి ఉంటుంది. రంగనాయక సాగర్ ప్రాజెక్టు తో సిద్దిపేట నియోజకవర్గంలో 71,516 ఎకరాలకు సాగునీరు అందుతుంది. చెరువులు, కుంటలు నిండుతాయని తెలిపారు.