
తెలంగాణ రాష్ట్రంలో డీఇఇసెట్ దరఖాస్తుల గడువును పాఠశాల విద్యాశాఖ మరోమారు పొడిగించింది. కరోనా వైరస్ లాక్‌డౌన్ నేపథ్యంలో దరఖాస్తులను మే 15 వరకు విద్యార్థులు దరఖాస్తులు సమర్పించవచ్చని వెల్లడించింది. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఇఐఇడి), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డిపిఎస్‌ఇ)లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశపరీక్ష డిఇఇసెట్-2020 నోటిఫికేషన్‌ను కన్వీనర్ కృష్ణారావు మార్చి 10న విడుదల చేశారు. దరఖాస్తులకు ఏప్రిల్ 8 చివరి తేదీ అని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారరు. అయితే రాష్ట్రంలో లాక్‌డౌన్ నేపథ్యంలో దరఖాస్తుల గడువును ఏప్రిల్ 27 వరకు పొడిగిస్తున్నట్లు ఈ నెల 3వ తేదీన ప్రకటించారు. అయితే మే 7 రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడింగించిన నేపథ్యంలో మరోసారి డిఇఇసెట్ దరఖాస్తుల గడువును మే 15 వరకు పొడిగించారు.