జీవకోటికి ప్రాణాధారం మొక్కల పెంపకం – మంచిర్యాల డిసిపి డి.ఉదయ్ కుమార్ రెడ్డి

గ్రీన్ ఇండియా చాలెంజ్ లో అన్నివర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
రాజ్యసభ సభ్యులు ఎంపి జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఈ రోజు మంచిర్యాల డిసిపి కార్యాలయం అవరణలో హరితహారం మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంచిర్యాల డిసిపి డి. ఉదయ కుమార్ మొక్కలను నాటారు. తాను మొక్కలను నాటడమే కాకుండా ఎసిపి, సీఐ, ఎస్ఐ, ప్రజలను కూడా మొకలను నాటేందుకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా డిసిపిమాట్లాడుతూ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లాలోని హోంగార్డ్ అధికారి నుండి ఉన్నత అధికారి వరకు ప్రతి ఒక పోలీస్ సిబ్బంది, ప్రజలు మూడు మొక్కలు నాటి మూడు సంవత్సరాల పాటు సంరక్షించాలన్నారు. మొక్కల పెంపకం లేకపోవడం వల్ల కాలుష్యం పెరిగిపోతున్నదని తెలిపారు. పర్యావరాన్ని పరిరక్షించే చర్యలకు స్వచ్ఛందంగా ముందుకురావాలని కోరారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.మొక్కలు నాటి వాటి సంరక్షణ భాద్యతలు సమర్దవంతంగా నిర్వర్తిస్తే అవి వృక్షాలుగా ఎదిగి పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తాయి. తద్వారా వర్షాలు కురుస్తాయి. ఎక్కడ చూసినా పచ్చదనమే ఉంటుందన్నారు. రాజ్యసభ్య సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా కొనసాగించడం అభినందనీయమన్నారు. ప్రజలు, యువత ముందుకు వచ్చి ఇందులో అందరూ భాగస్వామ్యులు కావాలన్నారు .