రంజాన్ మాసం ప్రారంభైన సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న తరుణంలో ఇంటి వద్దనే ప్రార్థనలు చేసుకోవాలని ముస్లింలకు కోరారు. ప్రజలెవరూ బయటికి రావద్దని సూచించారు. “ఈ శుభ మాసం సమాజంలో సామరస్యం, ఆనందం, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించాలని” అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. ఈ మేరకు సీఎం సందేశాన్ని తెలంగాణ సీఎంఓ ట్వీట్ చేసింది.