తెలంగాణలో ఈ రోజు కొత్తగా 7 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా ఏడు కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు 990 వందలకు చేరుకున్నాయి. కరోనా మహమ్మారికి ఇప్పటి వరకు 25 మంది బలయ్యారు. వైరస్‌ బారి నుంచి కోలుకుని 307 మంది బాధితులు ఆస్పత్రి నుంచి డిశ్చార్‌ అయ్యారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 638 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.