బోడుప్పల్‌ల్లో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు

బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. స్థానిక పెంటారెడ్డి కాలనీ వాసి పప్పు దినుసుల వ్యాపారికి రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్ కేసు నమోదైన సంగతి విధితమే..కాగా శనివారం అయన ఇద్దరు పిల్లలకు కూడా కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు బోడుప్పల్‌లో కరోనా కేసుల సంఖ్య మూడుకు చేరింది. మొదటి బాధితుడి పిల్లలకు కూడా పాజిటివ్ రావడంతో పెంటారెడ్డి కాలనీ పరిసర ప్రాంతాల ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది.

పాజిటివ్ నిర్థ్దారణ కాకముందు ఇద్దరు పిల్లలు ఇంటి పరిసర ప్రాంతాలకు చెందిన పొరుగువారి పిల్లలను కలిసినట్లు తెలిసింది. బాధితుడు భార్యకు కూడా పరీక్షలు కొనసాగుతున్నాయి. దీంతో వారితో కలిసి అడిన పిల్లల వివరాలను సేకరించడంలో అధికారులు నిమగ్నమైయ్యారు.పాజిటివ్ కేసుల సంఖ్య పేరగడంతో బోడుప్పల్ మున్సిపల్ యంత్రాంగం మరింత అప్రమత్తం కావాల్సి వస్తుంది. ఈ సందర్భంగా నగర మేయర్ సామల బుచ్చిరెడ్డి ,కమీషనర్ ఎన్.శంకర్ లు మాట్లాడుతూ ఇంటి నుంచి బయటకు రాకుండా స్వీయనియంత్రణలో ఉండాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు.సామాజిక దూరం పాటించి కరోనాను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.