ఆంధ్రప్రదేశ్‌లో 24 గంటల వ్యవధిలో కొత్తగా 81 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1097కు పెరిగింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకొని 231 మంది డిశ్చార్జ్ కాగా..835 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఏపీలో ఆదివారం ఉదయం వరకు 31 మంది ప్రాణాలు కోల్పోయారు. గడచిన 24 గంటల్లో 6768 శాంపిల్స్‌ను పరీక్షించగా 81 మందికి కోవిడ్19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది