దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్నా..మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) కేసులు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు మొత్తం 28,074 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సోమవారం వెల్లడించింది. ఇందులో 20,657 మంది కరోనా బాధితులు దేశంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ వైరస్ నుంచి ఇప్పటివరకు 6,533 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కాగా, దేశవ్యాప్తంగా మొత్తం 884మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఇప్పటివరకు అక్కడ కరోనా కేసుల సంఖ్య ఎనిమిది వేలు దాటింది. ఇక, ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 3,003,352కు చేరగా.. మృతుల సంఖ్య 2,07,094కు చేరింది.