తెలంగాణలో ఆరు పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఇవాళ నమోదైన ఆరు కేసులు మొత్తం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నిర్ధారణ అయ్యాయని చెప్పారు. కరోనా కేసులపై మంత్రి మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు 374 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 1,009కి చేరుకున్నాయి. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 610 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇవాళ తెలంగాణలో 42 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు మొత్తం 25 మంది మృతి చెందారు. ఈనెల 21వ తేదీ నుంచి కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని మంత్రి ఈటెల చెప్పారు.