ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని పేషీలో పనిచేసే అటెండర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. మంగళవారం నిర్వహించిన ట్రూనాట్ పరీక్షలో ప్రిజంప్టివ్ పాజిటివ్ అని వచ్చింది. దీంతో తుది నిర్ధారణ కోసం నమూనాను వైరాలజీ ల్యాబ్‌కి పంపారు. అటెండర్‌ను పిన్నమనేని సిద్దార్ధ వైద్య కళాశాలకు తరలించారు. విషయం తెలిసిన వెంటనే ఉప ముఖ్యమంత్రి నానికి, ఆయన భద్రతా సిబ్బందికి, పేషీలోని మిగతా అధికారులు, ఉద్యోగులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. అయితే, మంగళవారం అర్ధరాత్రి ఫలితాలు వెలువడగా అందరికీ నెగెటివ్ రిపోర్ట్ వచ్చిందని వైరాలజీ ల్యాబ్ ప్రొఫెసర్ రత్నకుమారి తెలిపారు.