కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతుండటంతో ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాల్లో నాటుసారా ఏరులై పారుతున్నది. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో పలుచోట్ల నాటుసారా స్థావరాలను గుర్తించి ఎక్సైజ్ పోలీసులు ధ్వంసం చేశారు. పలువురిని అరెస్ట్ చేశారు. తాజాగా విజయనగరం జిల్లాలో నాటుసారా స్థావరాలపై పోలీసులు రైడింగ్ చేశారు. టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఎల్విపెంట పోలీసుల సహకారంతో జరిగిన దాడుల్లో పెద్ద ఎత్తున నాటుసారాను, నాటుసారా తయారీకి ఉపయోగించే ముడిసరుకును ధ్వంసంచేశారు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు.