తెలంగాణ రాష్ట్రంలో బుధవారం కొత్తగా 22 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,038కి చేరుకుంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 568. కాగా కోవిడ్-19 కారణంగా ఇవాళ ముగ్గురు మృతిచెందారు. తెలంగాణలో కరోనా మృతుల సంఖ్య 28కి చేరింది. వ్యాధి నుంచి కోలుకుని ఇవాళ 33 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తం 442 మంది కరోనా బాధితులు వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.