కార్మికులకు గవర్నర్ తమిళిసై సౌదర రాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ మేడే శుభాకాంక్షలు తెలిపారు. దేశనిర్మాణంలో కార్మికుల శ్రమను గుర్తించిన రోజు మేడే. శ్రామికుల కష్టాన్ని గుర్తించి గౌరవిద్దాం. కార్మికులంతా ఆరోగ్యం, సంపదతో బాగుండాలని ప్రార్థిస్తున్నా. లాక్‌డౌన్ మార్గదర్శకాలు పాటించి కరోనాపై విజయం సాధించాలని గవర్నర్ పిలుపునిచ్చారు.
జాతి నిర్మాణంలో, నాగరికత వికాసంలో కార్మికుల చెమట, రక్తం ఉన్నాయి. యావత్ సమాజం కార్మికవర్గానికి అండగా నిలవాల్సిన తరుణమిదని సీఎం కేసీఆర్ కార్మికులు శుభాకాంక్షలు తెలిపారు.
కరోనా కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటున్న కార్మికులకు వందనం, వారందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు అని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. కార్మికుల శ్రేయస్సుకు సీఎం అన్ని చర్యలు తీసుకుంటున్నారు. విపత్తు నుంచి బయటపడ్డాక బంగారు తెలంగాణాలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.