గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ జి.వెంకటనారాయణ

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “తెలంగాణ కు హరితహారం” కార్యక్రమంలో భాగంగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ను అనుసరించి కమీషనర్, మంచిర్యాల మున్సిపాలిటీ ఇచ్చినటువంటి ఛాలెంజ్ ను స్వీకరించి మున్సిపాలిటీ కార్యాలయ నర్సరీలో మూడు (03) మొక్కలు నాటడం జరిగింది. అలాగే చెన్నూరు, లక్షేట్టిపేట్, నస్పూర్ కమీషనర్లకు కూడా క్యాతనపల్లి మున్సిపాలిటీ నుండి గ్రీన్ ఛాలెంజ్ ని ఇవ్వడంతో పాటు పర్యావరణ పరిరక్షణలో భాగంగా అందరూ తమవంతుగా మొక్కలు నాటాలని పిలుపునివ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జి. వెంకట నారాయణ, కమీషనర్, కె. నాగరాజు, మేనేజర్, ఈ. వసంత్, ఇంచార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్, వి. సంతోష్, ఇంచార్జ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఈ. కిశోర్, మెప్మా కో-ఆర్డినేటర్, ఆర్. పి లు మరియు కార్యాలయ సిబ్బంది అందరూ పాల్గొనడం జరిగింది.