జూన్‌ 11 వరకు స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల పరిధిలో ఉన్న పాఠశాలలకు జూన్‌ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించారు. లాక్‌డౌన్‌ కారణంగా పాఠశాలలన్నిటినీ ఇప్పటికే మూసి ఉంచిన సంగతి తెలిసిందే. క్యాలెండర్‌ ఇయర్‌ ప్రకారం జూన్‌ 11 వరకు వేసవి సెలవులను పాఠశాల విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. అయితే స్కూళ్లను ఆ తేదీ తరువాత మళ్లీ ఎప్పుడు తెరిచేది కోవిడ్‌–19 పరిస్థితిని అనుసరించి ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం తేదీలను తరువాత ప్రకటిస్తామని పాఠశాల విద్యాశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ బి.ప్రతాప్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.