ఏపీ హైకోర్టు కొత్త న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నూతన న్యాయమూర్తులుగా జస్టిస్‌ బొప్పూడి కృష్ణమోహన్‌, జస్టిస్‌ సురేశ్‌రెడ్డి, కే లలిత కుమారి ప్రమాణస్వీకారం చేశారు. అమరావతిలోని హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి వారితో ప్రమాణం చేయించారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా న్యాయవాదులు బీ కృష్ణమోహన్‌, కే సురేశ్‌రెడ్డి, కే లలిత కుమారిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.