ఏపీలో కొత్తగా మరో 62 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 62 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1525కు చేరింది. కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో ఏపీలో కరోనాకు ప్రధాన కేంద్రంగా మారిన కర్నూలు జిల్లాలో 25 ఉండగా, కృష్ణా జిల్లాలో 12, నెల్లూరు జిల్లాలో 6, అనంతపురం, కడప, విశాఖ జిల్లాలో నాలుగు చొప్పున ఉండగా, గుంటూరులో రెండు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 33 మంది మరణించారు. 441 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 1051 మంది చికిత్స పొందుకున్నారు.