
భారత్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య శనివారం సాయంత్రానికి 37,776కు చేరుకున్నదని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొంది ఇప్పటి వరకూ 10018 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 26535 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా వల్ల 1223 మంది చనిపోయారు. దేశంలోనే అత్యంత ఎక్కువగా మహారాష్ట్రలో కోవిడ్-19 బాధితుల సంఖ్య 10వేలు దాటింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సంభవించిన మరణాల్లోనూ అత్యంత ఎక్కువగా మహారాష్ట్రలోనే నమోదయ్యాయి.