రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌గా మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ డా.ఎంవీ రెడ్డి

రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌గా మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ డా.ఎంవీ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అధర్‌సిన్హా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌గా ఉన్న హరీశ్‌ తన వ్యక్తిగత కారణాల వల్ల సుమారు నాలుగు రోజుల వరకు సెలవులో వెళ్లనున్నారు. ఈ క్రమంలో డా.ఎంవీ రెడ్డిని ఈ నెల 25వ తేదీ నుంచి ఈ నెల 28వ తేదీ వరకు రంగారెడ్డి జిల్లాకు ఇన్‌చార్జి కలెక్టర్‌గా కొనసాగనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.