తెలంగాణలో కొత్తగా మరో 21 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో ఆదివారం కొత్తగా 21 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 20, జగిత్యాలకు చెందిన ఒకరున్నారు. దీంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,082కు చేరింది. 29 మంది మృతి చెందగా, 545 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మిగిలిన 508 మంది గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నట్టు ప్రజారోగ్యశాఖ బులెటిన్‌ విడుదలచేసింది. ఆదివారం డిశ్చార్జి అయిన వారిలో వివిధ అరోగ్య సమస్యలతో ఉన్న 68 ఏండ్ల వృద్ధు డు ఉన్నారు. రా జన్న సిరిసిల్ల, నల్లగొండ జిల్లా ల్లో ఆదివారం పలు కంటైన్మెంట్‌ జోన్లను ఎత్తివేశారు.