మలక్‌పేటలోని గంజ్ తోనే వనస్థలిపురంలో కరోనా….

వనస్థలిపురంలో కరోనా వైరస్ తో ఇద్దరు చనిపోవడంతో కలకలం సృష్టించింది. దీంతో వనస్థలిపురం ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. మూడు కుటుంబాల్లో 11 మందికి కరోనా సోకడంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు. 139 కుటుంబాలను హోమ్ క్వారంటైన్ లో ఉండాలని అధికారులు సూచించారు. జిహెచ్‌ఎంసి అధికారు పారిశుధ్య పనులు చేపట్టడంతో పాటు హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేస్తున్నారు. ఎల్‌బి నగర్ ఎంఎల్‌ఎ సుధీర్ రెడ్డి వనస్థలిపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మలక్‌పేటలోని గంజ్ నుంచి ఈ ప్రాంతానికి కరోనా వైరస్ వ్యాపించిందని తెలిపారు. ప్రజలెవరూ భయపడవద్దని వైరస్ నివారణకు చర్యలు చేపట్టామని వివరించారు. భారత దేశంలో ఇప్పటి వరకు 42,670 మందికి కరోనా వైరస్ సోకగా 1395 మంది మృతి చెందారు. తెలంగాణ కరోనా బాధితుల సంఖ్య 1082కు చేరుకోగా 29 మంది మృత్యువాతపడ్డారు. ప్రపంచంలో కరోనా వైరస్ 35.66 లక్షల మందికి సోకగా 2.48 లక్షల మంది చనిపోయారు. ఒక్క అమెరికాలో 11.88 లక్షల మంది కరోనా వైరస్ సోకగా 68 వేల మంది బలయ్యారు.