లాక్‌డౌన్ వల్ల వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న యాత్రికులు, విద్యార్థులు, వలస కార్మికులను వారి సొంతూళ్లకు పంపించడానికి కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. తెలంగాణలో చిక్కుకుపోయిన వారిని పంపించేందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేస్తోంది. పాస్‌ల కోసం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకునేలా తెలంగాణ పోలీస్‌శాఖ ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా ఓపెన్ చేసింది. ఐతే వేలాది మంది ఒక్కసారిగా సైట్ ఓపెన్ చేయడంతో ఆదివారం సైట్ క్రాష్ అయింది.
డీజీపీ కార్యాలయం ఈ దరఖాస్తులను పరిశీలించి పాసులను జారీ చేస్తోంది. ఆదివారం ఒక్కరోజే 7వేలకు పైగా పాసులు జారీ చేశారు. ఈ-పాస్ కోసం https://tsp.koopid.ai/epass వెబ్‌సైట్‌ను సందర్శించి వివరాలు పూర్తిచేయాలి. ఈ-పాస్ అప్లికేషన్ దరఖాస్తు విధానం కింద వివరించడం జరిగింది.