ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. కరోనా విలయతాండవానికి ఆ రాష్ట్రం అతలాకుతలమవుతోంది. ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 67 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందారు. తాజాగా మృతి చెందిన వ్యక్తిది కృష్ణా జిల్లా. ఇప్పటి వరకు ఏపీలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,717. ఈ వైరస్ నుంచి 589 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనాతో ఇప్పటి వరకు 34 మంది మరణించారు.
గడిచిన 24 గంటల్లో అనంతపూర్‌లో రెండు, గుంటూరులో 13, కడపలో 2, కృష్ణాలో 8, కర్నూల్లో 25, విశాఖపట్టణంలో రెండు, నెల్లూరులో ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. మిగతా 14 మంది గుజరాత్‌కు చెందిన వారని ఏపీ వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.