పార్లమెంట్ ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్‌గా కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదురి నియమితులయ్యారు. చైర్మన్ సహా లోక్‌సభ, రాజ్యసభ నుంచి 22 మందిని సభ్యులుగా నియమిస్తూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ కాలపరిమితి మే 1 నుంచి 2021, ఏప్రిల్ 30 వరకు ఉంటుందని వెల్లడించారు. ఇందులో లోక్‌సభ నుంచి 15 మంది, రాజ్యసభ నుంచి ఐదుగురు సభ్యులుగా ఉన్నారు.