గుడిమల్కాపూర్ మార్కెట్ ముగ్గురికి కరోనా పాజిటివ్

హైదరాబాద్ నగరంలో కరోనా మహమ్మారి మార్కెట్‌లో విజృంభిస్తుంది. మొన్నటివరకు మలక్‌పేట గంజ్‌లోని వ్యాపారులను వణికించి.. హమాలీలు, చిరువ్యాపారులను గాంధీ ఆసుపత్రికి చేర్చింది. మంగళవారం గుడిమల్కాపూర్ మార్కెట్‌లో వైరస్ బయటపడింది. ముగ్గురు వ్యక్తులకు పాజిటవ్ వచ్చినట్లు తెలిస్తుంది. వారు ఎంతమందితో కాంటాక్టులో ఉన్నరో వారిందరి వివరాలు సేకరిస్తూ అనుమానితులకు పరీక్షలు చేస్తున్నారు. మార్కెట్ వ్యక్తుల ద్వారా మరింత మందికి వ్యాప్తించే అవకాశముందని వైద్యశాఖ అధికారులు భావిస్తున్నారు.