ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావుతో టీఆర్‌ఎస్‌ దక్షిణాఫ్రికా కోర్‌కమిటీ సభ్యుల భేటీ

మంత్రి హరీష్ రావుతో ధక్షిణాఫ్రికా కోర్ కమిటీ సభ్యుల సమావేశం

ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్‌రావుతో టీఆర్‌ఎస్‌ ఎన్నారై కో ఆర్డినేటర్‌ మహేశ్‌ బిగాల ఆధ్వర్యంలో దక్షిణాఫ్రికా కోర్‌కమిటీ సభ్యులు సమావేశామయ్యారు. ఈ సమావేశంలో కన్వీనర్‌ వెంకట్‌రావు తాళ్లపెల్లి, కార్యదర్శి జైవిష్ణు గుండా, సాయికిరణ్‌ నల్లా, నవదీప్‌రెడ్డి గుడిపాటి, రేపల శ్రీనివాస్‌ పాల్గొన్నారు. రాబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపు పక్కా అన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తాయన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం తమ కృషిచేస్తామని తెలిపారు.