ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి బారిన పడుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నది. రాష్ట్రంలో కొత్తగా 60 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1777కు చేరింది. ఇందులో 1012 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 729 మంది బాధితులు కోలుకుని డిశ్చార్చి అయ్యారు.
కరోనాతో ఇవాల కొత్తగా ఇద్దరు మరణించారు. దీంతో రాష్ట్రంలో ఈ వైరస్ వల్ల మృతిచెందినవారి సంఖ్య 36కు పెరిగింది. ఇవాల మరణించినవారులో వీరు కర్నూలు, కృష్ణా జిల్లాలకు చెందినవారు ఉన్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో కర్నూలు జిల్లాలో 17 కేసులు, కృష్ణా 14, గుంటూరు 12, విశాఖపట్నంలో రెండు, కడప, పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్కో కేసు నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలులో 533 కేసులు, గుంటూరులో 363, కృష్ణా జిల్లాలో 300 కరోనా కేసులు నమోదయ్యాయి.