
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడింది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేస్తూ ఎస్‌ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఎన్నికల ప్రక్రియ నిలిపివేయాలని ఈ సందర్భంగా నోటిఫికేషన్ జారీ చేసింది. లాక్‌డౌన్ పొడిగింపు, హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ఎస్‌ఈసీ పేర్కొంది. గతంలో ఎన్నికలు నిలిపివేయాలని పలువురు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.