తెలంగాణలో కొత్తగా 11 కరోనా కేసులు

‌తెలంగాణలో బుధవారం 11 కరోనా వైరస్ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,107కు చేరుకుంది. తాజాగా 20 మంది డిశ్చార్జి కావడంతో ఇప్పటివరకు 648 మంది కోలుకొని ఇంటికి వెళ్లారు. ఈ మేరకు తెలంగాణ ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఈ రోజు నమోదైన పదకొండు కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనివే కావటం గమనార్హం. ఇప్పటివరకు కరోనా బారినపడి 29 మంది ప్రాణాలు కోల్పోగా.. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 430 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, వరంగల్‌(రూరల్‌), యాదాద్రి, వనపర్తి జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు.