విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి పీవీసీ(పాలీవినైల్ క్లోరైడ్) గ్యాస్ లీక్ అయినట్లు అక్కడి అధికారులు ప్రాథమికంగా నిర్ధారించిన విషయం విదితమే. పీవీసీ గ్యాస్‌ను అన్ని ప్లాస్టిక్ వస్తువుల తయారీలో వినియోగిస్తారు. పీవీసీ లేకుండా ఏ ప్లాస్టిక్‌ను కూడా తయారు చేయలేరు. ప్లాస్టిక్‌ను తయారు చేసే క్రమంలో పాలీవినైల్ క్లోరైడ్‌లోని క్లోరిన్ వాయువు లీకైతే అత్యంత ప్రమాదం. అయితే ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమలో అదే జరిగింది.
లాక్‌డౌన్ తర్వాత పరిశ్రమను తెరిచే క్రమంలో అత్యంత ప్రమాదకరమైన క్లోరిన్ వాయువు లీకైంది. ఈ క్లోరిన్ అధిక గాఢత కలిగి ఉండటం వల్ల ఆ వాయువును పీల్చిన వెంటనే ఊపిరితిత్తులపై నేరుగా ప్రభావం చూపుతుంది. దీంతో శ్వాస సంబంధ సమస్యలు తలెత్తుతాయి. ఈ వాయువు వాతావరణంలోని ఆక్సిజన్‌తో కలిసి డయాక్సిన్స్‌ను ఏర్పాటు చేసి అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. తక్షణమే మనషులతో పాటు మూగ జీవాలు అపస్మారక స్థితిలోకి వెళ్లడం, చనిపోవడం జరుగుతుంది. చెట్లు కూడా మాడిపోతాయి. మనం ధరించే దుస్తులు కూడా పసుపు రంగులోకి మారుతాయి. పాలీవినైల్ క్లోరైడ్‌లోని క్లోరిన్ క్యాన్సర్ కారకం కూడా.