
సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఆర్థిక మంత్రి హరీష్ రావు, జడ్పీఛైర్మన్ రోజాశర్మ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రజలంతా క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకోవాలి. ప్లాస్టిక్ నిషేధంలో అందరూ భాగస్వామ్యం కావాలి. సిద్ధిపేటలో రూ.40 లక్షలతో క్రిస్టియన్ భవన్ నిర్మిస్తున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు.