- వాటరింగ్ డేలో కలెక్టర్ రవి
ప్రతి ఒక్కరూ బాధ్యతగా నీరుపోసి మొక్కలను బతికించాలని కలెక్టర్ గుగులోత్ రవి సూచించారు. వాటరింగ్ డేలో భాగంగా గొల్లపల్లి మండలం గోవిందులపల్లి, అబ్బాపూ ర్, రాఘవపట్నంలో ప్లాంటేషన్లను పరిశీలించి, మొక్కలకు నీరు పట్టారు. అబ్బాపూర్‌లో 2వేల మొక్కలతో ఏర్పాటు చేసిన ప్లాంటేషన్, నీటి సరఫరా బాగుందని కితాబునిచ్చారు. గ్రామంలో నర్సరీని పరిశీలించి ఉపాధి కూలీల సమస్యలు తెలుసుకున్నారు. రాఘవపట్నంలోని మంకీ ఫుడ్‌కోర్టును సందర్శించారు. ఆయన వెంట డీఆర్డీవో లక్ష్మీనారాయణ, తహసీల్దార్ నవీన్‌కుమార్, ప్రత్యేకాధికారి జయాకర్, ఎంపీపీ నక్క శంకరయ్య, ఉన్నారు. కోరుట్ల మండలం నాగులపేటలో మొక్కలకు అదనపు కలెక్టర్ రాజేశం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి నీటిని అందించారు. ఉపాధి హామీ కూలీలకు ప్రతిమ ఫౌండేషన్ అందించిన మాస్కులను పంపిణీ చేశారు. నాగులమ్మ ఆలయంలో పూజలు చేశారు. ఆయనవెంట ఏపీడీ సుందర వరదరాజన్ ఉన్నారు. మేడిపల్లి మండలం భీమారంలోనూ కమ్యూనిటీ ప్లాంటేషన్‌ను అదనపు కలెక్టర్ పరిశీలించారు. పెగడపల్లి మండలం వెంగళాయిపేటలో ఆర్అండ్బీ రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలను డీఆర్డీవో లక్ష్మీనారాయణ పరిశీలించారు. జడ్పీటీసీ కాసుగంటి రాజేందర్రావు, ఎంపీడీవో వెంకటేశం ఉన్నారు. సారంగాపూర్ మండలం పెంబట్ల, సారంగాపూర్‌లో హరితవనాలు, మంకీఫుడ్కోర్టులను డీఎల్పీవో ప్రభాకర్ పరిశీలించి ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలకు నీళ్లు పట్టారు. జగిత్యాల రూరల్ మండలం అంబారిపేట, హస్నాబాద్, మోతె, ధరూర్‌లో అధికారులు వాటరింగ్ డే నిర్వహించారు. మల్లాపూర్ మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో డీపీవో శేఖర్ వాటర్ డేలో పాల్గొన్నారు. మెట్పల్లి మండలం కొండ్రికర్ల, చౌలమద్ది, రామారావుపల్లెలో ప్రజాప్రతినిధులు, అధికారులు మొక్కలకు నీళ్లు పట్టారు.