దేశంలో కరోనా విలయం కొనసాగుతున్నది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 3227 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ ప్రభావంతో కొత్తగా 128 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 62,779కి పెరిగింది. ఇప్పటివరకు 2208 మంది మృతిచెందారు. దేశంలో 41,472 కేసులు యాక్టివ్గా ఉన్నాయని, ఈ వ్యాధి బారిన పడిన 19,358 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.
దేశంలో కరోనాకు కేంద్ర బిందువుగా మారిన మహారాష్ట్రలో కరోనాకేసులు 20వేలు దాటాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 779 మంది మరణించారు. గుజరాత్లో 7797 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, 472 మంది మరణించారు. బీహార్లో కొత్తగా 18 కరోనా కేసులు నమోదాయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 629కి పెరిగాయి.