24 గంట‌ల్లో 3,525 కేసులు.. 122 మ‌ర‌ణాలు

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉన్న‌ది. రోజురోజుకు వేల సంఖ్య‌లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. వంద‌ల్లో మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి. మంగ‌ళ‌వారం ఉద‌యం 9 గంట‌ల‌ నుంచి బుధ‌వారం ఉద‌యం 9 గంట‌ల వ‌ర‌కు కేవ‌లం 24 గంట‌ల వ్య‌ధిలో కొత్త‌గా 3,525 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 74,281కి చేరింది. 

ఇక, దేశంలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య కూడా వేగంగా పెరుగుతున్న‌ది. గ‌త 24 గంట‌ల వ్య‌వ‌ధిలో అన్ని రాష్ట్రాల్లో క‌లిపి 122 క‌రోనా మ‌ర‌ణాలు సంభ‌వించాయి. దీంతో దేశంలో న‌మోదైన మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 2,415కు చేరింది. కాగా, దేశంలో న‌మోదైన మొత్తం కేసుల‌లో ప్ర‌స్తుతం 47,480 మాత్ర‌మే యాక్టివ్ కేసులు ఉన్నాయి. మిగ‌తా వారిలో 24,386 మంది వైర‌స్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, 2415 మంది మృతిచెందారు.