కరోనాపై పోరులో భాగంగా మరిన్ని పొదుపు చర్యలు చేపట్టనున్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. ఈ ఏడాదంతా వేతనంలో 30 శాతం కోత విధించుకోవాలని నిర్ణయించారు. ఈ చర్యల వల్ల సుమారు రూ.200 కోట్లకుపైగా వార్షిక బడ్జెట్‌లో 20 శాతం అంటే రూ.40-45 కోట్లు ఆదా అవుతాయని అధికారుల అంచనా. రాష్ట్రపతి తీసుకునే పొదుపు చర్యలు ఇవే..
- దేశీయ పర్యటనలు, కార్యక్రమాలు తగ్గింపు
- ఎట్ హోం, ఇతర విందుల్లో అతిథుల సంఖ్య, ఆహార పదార్థాల తగ్గింపు
- ప్రత్యేక కార్యక్రమాల్లో వినియోగించే లిమోసైన్ (రూ.10 కోట్ల విలువైన కారు) కొనుగోలు వాయిదా
- రాష్ట్రపతి భవన్‌లో అవసరం మేరకే మరమ్మతులు
- ఈ ఆర్థిక సంవత్సరం వరకు కొత్త నిర్మాణ పనులకు దూరం
- ఇంధనం, విద్యుత్ వినియోగంలో పొదుపు చర్యలు
- పర్యావరణ హితంగా రాష్ట్రపతి భవన్ కార్యాలయం. సాంకేతిక విధానాల ద్వారా ప్రజలతో కోవింద్ మమేకం