హరితహారానికి ఉపాధి హామీ అనుసంధానం

తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని జూలై రెండోవారంలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లుచేస్తున్నది. ఇందుకోసం 12,738 నర్సరీల్లో 25 కోట్ల మొక్కలను సిద్ధంగా ఉంచింది. జూన్‌నుంచే గుంతల తవ్వకం ప్రారంభించనున్నది. హరితహారం కార్యక్రమాన్ని ఉపాధిహామీకి అనుసంధానం చేయటంతో ఆ పథకంలో కూలీలకు మెరుగైన ఉపాధి లభిస్తున్నది. వర్షాలు మొదలుకాగానే గుంతలు తీసే కార్యక్రమాన్ని మొదలుపెట్టనున్నట్టు పంచాయతీరాజ్‌శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ బీ సైదులు చెప్పారు. ఈసారి గ్రామాల్లో ఉపాధి కూలీల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదని, ఆ సంఖ్య ఇప్పటికే 25 లక్షలు దాటిందని చెప్పారు. గ్రామ పంచాయతీకి ప్రభుత్వం ట్రాక్టర్‌ను అందజేయడం హరితహారానికి ఎంతో మేలు చేస్తున్నది.  సర్పంచ్‌లు ట్రాక్టర్‌ను ట్యాంకర్‌గా వాడి మొక్కలకు నీళ్లు పోస్తున్నారు.