తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ నిబంధనల ప్రకారం మాస్కులు ధరించకుండా రోడ్లపైకి వచ్చిన 5వేల మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. లాక్డౌన్ నిబంధనలను పట్టించుకోకుండా రోడ్లపై తిరిగే వారిపై, షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లలో మాస్కులు ధరించని వారిని గుర్తించి పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఈక్రమంలో నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో 3.722 కేసులు నమోదయ్యాయని, మిగిలిన కేసులు వరంగల్, కరీంనగర, నల్గొండ, నిజామాబాద్ జిల్లాలో నమోదు చేసినట్లు పోలీసులు వివరిస్తున్నారు. రహదారులపై మా స్కులు లేకుండా తిరుగుతున్న వారిని సిసిటివి ఆధారంగా గుర్తించిన పోలీసులు వారికి వె య్యి రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ చలానాలు విధిస్తున్నారు. కాగా మాస్కులకు సంబంధించిన జరిమానాలను కోర్టులో చెల్లించేలా ఏర్పాట్లు చేశారు. మాస్కులు ధరించని వారిపై డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్టు సెక్షన్ 51 బి కింద నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు 5వేల మందిపై కేసులు నమోదు చేసిన ట్టు పోలీసు ఉన్నతాధికారులు వివరిస్తున్నారు.
