యూపీఎస్సీ పలు పరీక్షల ఫలితాలు విడుదల

కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించిన పోటీ పరీక్షల ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. ఫలితాలకోసం అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వైబ్‌సైట్‌ upsc.gov.inలో చూడవచ్చని వెల్లడించింది. ఫలితాలు వెల్లడైన వాటిలో సీనియర్‌ ఎగ్జామినర్‌, అసిస్టెంట్‌ లీగర్‌ అడ్వైజర్‌, కంపనీ ప్రాసిక్యూటర్‌, డిప్యూటీ సెంట్రల్‌ ఇంటెలిజన్స్‌ ఆఫీసర్‌, జాయింట్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వంటి పోస్టులు ఉన్నాయి. ఈ మొత్తం 136 పోస్టుల భర్తీకి యూపీఎస్సీ మార్చి 8న కంప్యూటర్‌ ఆధారిత పరీక్షను నిర్వహించింది.