జగిత్యాల జిల్లాలో మరో మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. ఉపాధి కోసం ముంబాయి వలస వెళ్లి తిరిగి స్వగ్రామాలకు వచ్చిన ముగ్గురికి కరోనా పాజిటివ్ గా తేలింది. మల్యాల మండలం తాటి పెళ్లి గ్రామానికి చెందిన ఇద్దరికి, గొల్లపల్లి మండలం బొంకూరు కు చెందిన మరో వ్యక్తికి పాజిటివ్ వచ్చిందని డీఎంహెచ్ వో తెలిపారు. వీరిని ఐసోలేషన్ లో ఉంచామని త్వరలోనే గాంధీ దవాఖానకు తరలిస్తామన్నారు.
