డిప్లొమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈడీ) ఫస్టియర్ పరీక్షలు ఆగస్టు 3వ తేదీనుంచి ప్రారంభం అవుతాయని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 8వ తేదీతో పరీక్షలు ముగియనున్నాయి. 2018–2020 బ్యాచ్ విద్యార్థులతో పాటు గతంలో ఫెయిలైన వారు కూడా పరీక్షలకు హాజరుకానున్నారు. రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. బిట్ పేపర్ పరీక్ష చివరి అరగంటలో ఇస్తారని డైరెక్టర్ తెలిపారు.
