ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీంతో రానున్న 24గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. శనివారం నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారింది. హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. మెహదీపట్నం, లంగర్ హౌస్, గుడిమల్కాపూర్, కోఠి, బేగంబజార్, అబిడ్స్, హిమాయత్ నగర్, నాంపల్లి, కాచిగూడ, నల్లకుంట, అంబర్ పేట్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, లక్డీకాపూల్, మాసబ్ ట్యాంక్ , సెక్రటేరియట్ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఆగ్నేయ బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపు ఉదయానికి వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. రాగల 12గంటల్లో వాయుగుండం తూఫానుగా మారే ప్రమాదం ఉంది. దీంతో తెలంగాణలో ఈరోజు, రేపు పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షం పడనుంది.
